పురుష సెక్స్ హార్మోన్ టెస్టోస్టిరాన్ టెస్టికల్స్ అంటే వృషణాలలో ఉత్పత్తి అవుతుంది. వృషణాలలో ఉండే లైండింగ్ సెల్స్ ని మెదడులో ఉండే పిట్యుటరీ గ్రంధి నుండి ఉత్ప్పత్తి అయ్యే గొనాడో ట్రాఫిక్ హార్మోన్లు ప్రభావితం చేస్తాయి. కొందరిలో గొనాడా ట్రాఫిక్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గడానికి మెదడులోని హైపోథాలమస్ నుంచి గొనాడో ట్రాఫిక్ రిలీజింగ్ హార్మోన్ లేకపోవడం ఒక కారణం. మెదడే ప్రధాన సెక్స్ అవయమని అంతర్జాతీయ సెక్సాలజిస్టులు చెప్పారు. మెదడులో ఆ భావన తీవ్రంగా కలిగిన వెంటనే అంగం రాయిలా స్తంభిస్తుంది. అయితే మనసు ప్రశాంతంగా, ఎటువంటి వత్తిడి లేకుండా ఉండాలి.
కుర్రాళ్ళలో కూడా అంగం పటిష్టంగా స్తంభించని సమస్య ఉంటోంది. సెక్స్ కోరిక కలగడం మామూలే. కానీ అంగం ఒక రాయిలా స్ధంభించాలి. అప్పుడే ఆమెకు సంతృప్తి. అంగం అంతగా స్ధంభించాలంటే శరీరంలో విడుదలయ్యే హార్మోన్ల ప్రభావం ఉంటుందని ప్రముఖ సెక్సాలజిస్టు డాక్టర్ సమరం తరచు చెబుతున్నారు.