•  

కామసూత్ర- ఆమెకు ఆ వాంచ ఉండదెందుకు?

Why a woman becomes frigid, loses sexual desire?
 
కొందరు స్త్రీలలో సెక్స్ కోరికలు ఉండవు. వారిని జఢత్వం ఆవరించి ఉంటుంది. వారిని ఎంతగా ప్రేరేపించినా సెక్స్ స్పందనలు కలుగవు. సెక్స్ కోరికలు లేని స్త్రీలను డాక్టర్ సమరం మూడు రకాలుగా వర్గీకరించారు. ఒక రకం స్త్రీలలో కోరిక, స్పందన రెండూ ఉండవు. పెళ్ళయినా సెక్స్ లో పాల్గొనడానికి విముఖత చూపిస్తారు. రెండో రకం స్త్రీలలో మామూలు సమయంలో సెక్స్ ఆలోచన రాదు. కోరిక కూడా తక్కువే. అయితే పడక గదిలో అనునయంగా ప్రేరణ కలిగిస్తే ఉద్రేకపడడం, సెక్స్ లో తృప్తి పడడం జరుగుతుంది. మూడో రకం స్త్రీలలో సెక్స్ కోరిక ఉండదు. భయం వల్ల కానీ మరో కారణం వల్ల కానీ భర్త ఫోర్స్ చేస్తే సెక్స్ లో పాల్గొంటారు. కానీ స్పందనలు ఉండవు. యాంత్రికంగా ఉండిపోతారు.

పెళ్ళైన కొత్తలో సెక్స్ లో ఎంతో యాక్టివ్ గా ఉండే కొందరు మహిళలు కాలక్రమేణా సెక్స్ అంటే ఆసక్తి కోల్పోతారు. అందుకు ప్రధాన కారణం భర్తే. పనుల ఒత్తిడి వల్లనో, దురలవాట్ల కారణంగానో అతను సెక్స్ లో తరచు విఫలమవుతుంటే ఆమెలో జఢత్వం ఆవరిస్తుంది. అతను ఆమెను సంతృప్తి పరచకపోవడం వల్ల నపుంసకుడైపోయాడేమోనన్న ఆందోళన ఆమెకు కలుగుతుంది. అతనికి మాత్రం ఆ కోరిక చావదు. అయినా అది లేచి చావదు.

ఇది చాలా విచిత్రమైన స్ధితి అని సమరం అనే సందర్భాల్లో పాఠకుల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. ఆ స్ధితిలో ఆమె న్యూరోసిస్ కు గురై పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. అతనిని నపుంసకుడని నిందించడంతో అతను మిగిలి ఉన్న చిన్న విశ్వాసాన్ని కోల్పోతాడు. ఈ దశలో ఇద్దరికీ సెక్సాలజిస్టు వద్ద కౌన్సిలింగ్ అవసరం. ఇది పెద్ద సమస్య కానే కాదు, ఒక నెల కౌన్సిలింగ్ తర్వాత మళ్ళీ ఇద్దరూ ఎప్పటిలాగానే మన్మద సామ్రాజ్యంలో హాయిగా సుఖించవచ్చు.

Story first published: Tuesday, July 13, 2010, 17:27 [IST]

Get Notifications from Telugu Indiansutras