•  

సెక్స్: తొలిరేయి ఇలాగైతే హాయి

First Night fears can be Overcome
 
ఎన్నో ఊహలు, ఎంతో థ్రిల్, జీవితంలో అంతకు మించిన అనుభూతి మరొకటి ఉండదేమో. అదే తొలి రేయి. దానిమీద ఎన్నో సినిమా సన్నివేశాలు, ఎన్నో చక్కటి పాటలు ఉన్నాయి. కానీ కొంత మంది తొలి రోజునే కాదు, ఆ మూడు రోజుల్లోనూ ఎంజాయ్ చేయలేరు. ఎంజాయ్ చేయలేదన్న బాధే అధికం. సాఫ్ట్ గా ఉండే సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్ లో ఈ ఆవేదన అధికం.

తొలి కలయిక భయం వల్ల కొందరికి అంగస్తంభన కలుగదు. మరికొందరికి అంగం గట్టిగా లేచినా యోని ప్రవేశం జరుగదు. ఇక్కడ అబ్బాయి దోషం లేకపోయినా అమ్మాయిలో ఉండే భయ భ్రాంతులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. తొలి కలయిక అంటే బాధాకరమైనదన్న భావన ఆమె మదిలో ఉండిపోయి ఉంటుంది. నవ వధువుకు తొలి కలయిక బాధాకరంగా ఉండాల్సిన అవసరం లేదు. ఆమె మనసుకు సెక్స్ కు సమాయత్తమైతే యోని కండరాలు పట్టు వదిలేస్తాయి. యోని మార్గం వదులై పోతుంది. యోని వద్ద ద్రవాలు స్రవించి అంగప్రవేశం అవలీలగా జరుగుతుంది.

ఇటువంటి అనుకూల స్ధితి తొలి కలయికలో ఏర్పడాలంటే సెక్స్ లో పాల్గొనేముందు ఫోర్ ప్లే అవసరం. ఇద్దరూ టెన్షన్ కు దూరమై ఇది కూడా ఒక క్రీడ అన్న ఫీలింగ్ లోకి రావాలి. ఒకరి మీద ఒకరు అనవసర అనుమానాలు పెట్టుకోకుండా ముందుకు సాగిపోవాలి. ఆ సమయంలో ఇద్దరి మధ్య చక్కటి సంభాషణ ఉండాలి. నేరుగా సెక్స్ లో పాల్గొనకుండా ముద్దు ముచ్చట కొనసాగించాలి. పూర్తిగా వివస్త్రులైన ఆ కొత్త దంపతులు ఆలింగనంతో ఒకటైతే శరీరాలు పులకరిస్తాయి. ఆ రెండు శరీరాల మధ్య బాడీ కెమిస్ట్రీ అద్భుతంగా పనిచేస్తుంది. పూర్తిగా వివస్త్ర కావడానికి అతను సిద్ధమే కానీ, ఆమెలో అలా కావడానికి ఎన్నో బిడియాలు. పూర్తిగా వివస్త్రులు కాని కొత్త దంపతుల విషయంలో ఈ పులకింత, పరవశం తక్కువగా ఉంటాయి.

పరస్పరం అనుమానాలు లేకుండా ఆ రతి కార్యక్రమాన్ని స్పోర్టివ్ గా తీసుకుంటే అన్నీ సజావుగా జరిగిపోతాయి. ఇద్దరు మన్మధ సామ్రాజ్యంలోకి ప్రవేశించిన తర్వాత నిద్ర, మళ్ళీ అరగంటకు అదే సామ్రాజ్య ప్రవేశం. మంచం మీద మల్ల యుద్ధం...మళ్ళీ తెల్లవారు జామున అదే పని. ఇద్దరూ విడి విడిగా బ్రష్ చేసుకుంటూ ఉన్నా మళ్ళీ అవే ఆలోచనలు. బ్రేక్ ఫాస్ట్ అయినా ఆ లాచనలకు బ్రేక్ ఉండదు. అదే తోలి రేయి మహత్యం. మరిన్ని వివరాలు వచ్చే ఆర్టికల్ లో....

Story first published: Friday, June 11, 2010, 15:16 [IST]

Get Notifications from Telugu Indiansutras