సెక్స్- పరమ ఔషధం

Good Health
 
ఆరోగ్యకరమైన సెక్స్ ఉల్లాసభరితమైన జీవనానికి బాటలు వేస్తుంది. చర్మం నిగనిలాడడానికి, జుట్టుచక్కగా ఉండడానికి మీరు ఎన్నో ఔషధాలను వాడి ఉండవచ్చు. కానీ సెక్స్ లో అపరిమిత ఆనందం పొందుతున్న వారికి చర్మం నిగనిగలాడుతుంది. కొన్ని రసాయన చర్యల వల్ల అది సాధ్యమౌతోంది. డిప్రెషన్ కు కూడా సెక్స్ మంచి ఔషధం. సెక్స్ వల్ల అదనపు కేలరీలు కరిగిపోయి పొట్ట పెరగకుండా ఉంటుంది. ఆస్ధమా, తలనొప్పి కి కూడా సెక్స్ మంచి ఔషధం. రుగ్మతలను ఎదుర్కొనే రసాయనాలు సెక్స్ ద్వారా శరీరానికి అందుతాయి. మంచి సెక్స్ జీవితం వల్ల మానసిక ఆనందం, భద్రతా భావం కలుగుతాయి. అందువల్ల సాధ్యమైనన్ని ఎక్కువ సార్లు సెక్స్ లో పాల్గొనడానికి ప్రయత్నించాలి. ఇందుకోసం ఇద్దరు భాగ స్వాముల మధ్య మంచి అవగాహన అవసరం.

హృద్రోగాలు, పక్షవాతం, వివిధ కండరాలకు సంబంధించిన జబ్బులు సెక్స్ చేసేవారిలో చాలా తక్కువగా వస్తాయని సెక్సాలజిస్టులు చెపుతున్నారు. అంతేకాదు ప్రపంచంలోని కార్డియాలజిస్టులందరూ అంగీకరించిన విషయం ఇది. వారానికి కనీసం నాలుగుసార్లు సెక్స్‌లో పాల్గొనేవారి ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా లేదని వైద్యులు ధృవీకరిస్తున్నారు.

ఒకప్పుడు సెక్స్‌ను ఓ వ్యాయామంగా భావించడం జరిగింది. ఇప్పుడు వాటన్నిటికీ మించి సెక్స్‌లో పాల్గొనటమే ఓ ఔషధమని వైద్యులు చెపుతున్నారు. శీఘ్ర స్కలనమైనా ఫర్వాలేదు కానీ అసలు స్కలనం అంటూ జరగాలంటున్నారు. ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో సెక్స్ పాత్ర ఎంతో అమూల్యమైనదని అంటున్నారు.

Story first published: Monday, November 2, 2009, 17:21 [IST]
Please Wait while comments are loading...