•  

కామసూత్ర- మనసే ముఖ్యం

Mind Game
 
శృంగారం మనసుకు సంబంధించిన క్రీడ. తాను ఆ పనిని సరిగా చేయలేనేమోనన్న ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తే ఇక అంతే. మంచి రతి సామర్ధ్యమున్నా అది మరుగున పడిపోతుంది. ఎన్ని సార్లు రతిలో పాల్గొన్నామన్నది ముఖ్యం కాదు, ఇద్దరూ ఎంత గొప్ప ఆనందాన్ని పొందారన్నది ప్రధానం. శృంగార సామర్ధ్యానికి శరీర ఆకృతి, శరీర సౌష్టవానికి సంబంధంలేదు. ఇద్దరి మధ్య ప్రేమ, ఆకర్షణ, పరస్పర సహకారం ఉంటే ఆ సుఖంలో ఆకాశపు అంచులు తాకవచ్చు.

శారీరక దారుడ్యం కంటే మానసిక బలం శృంగార సామర్ధ్యానికి గీటురాయి. శృంగారంలో సమర్ధులైన పురుషులు జీవితంలో ఎన్నో విజయాలు సాధిస్తారు. పడక గదిని జయించిన వారు రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. శృంగారంలో సమస్యలున్న వారికి పనిలో ఏకాగ్రత ఉండదు. చికాకుగా ఉంటారు.

మగవాళ్ళనే కాదు మహిళలను కూడా వేధించే సమస్య మగవారి శీఘ్రస్కలనం. ఇది దాదాపు అందరినీ వేధించే ప్రధాన సమస్య. రతి ఎంత సేపు చేస్తారనే విషయంలో ఇటీవల అనేక పరిశోధనలు జరిగాయి. దాని ప్రకారం రతి సమయం రెండు నిముషాల నుంచి 13 నిముషాలని తేలింది. మూడు నాలుగు నిముషాలైనా ఇద్దరూ భావప్రాప్తి పొందిన కేసులు ఎన్నో ఉన్నాయి. శీఘ్ర స్కలనం సమస్య ఉన్నా తరచుగా శృంగారంలో పాల్గొనడమే ఈ సమస్యకు పరిష్కారం. మహిళ చికాకు పడకుండా సహకరిస్తూ పోతే సమస్యను పురుషుడు అధిగమిస్తాడు. ఆత్మ విశ్వాసంతో దూసుకుపోతాడు. మహిళ కించపరిస్తే ఇంకా ముడుచుకు పోతాడు.

ఇటీవల భార్యాభర్తలు ఇద్దరూ ధైర్యంగా తమ సమస్యలను సెక్సాలజిస్టులకు చెప్పుకుంటున్నారు. ఇది మంచి పరిణామం. ఇంట్లో సంతృప్తి లేదని ఇద్దరూ అక్రమ సంబంధాలకు తెగించడం కూడా జరుగుతుంది. అక్రమ సంబంధాల వల్ల అనేక అనర్ధాలు ఉన్నాయి. భార్యా భర్తలు ఒకరికొకరు సన్న్నిహితంగా ఉండి, చర్చించుకుని, కొన్ని పుస్తకాలు చదువుకుని ముందుకు సాగితే వైద్యుడి అవసరం కూడా ఉండదు.

Story first published: Monday, November 2, 2009, 17:15 [IST]

Get Notifications from Telugu Indiansutras