సంభోగం అంటే సమభోగం. భాగస్వాములిద్దరూ ఈ క్రీడలో సమానంగా పాలు పంచుకుని, సమానంగా ఆనందం అనుభవించాలి. అందుకు ఆమె సహకారం కూడా ఎంతో అవసరం. ఆమె సున్నిత అవయవాలను అతను మీటుతుంటే, అతడు ఎక్కువగా అనందానుభూతి చెందే చోట్ల ఆమె తాకాలి. భారమంతా తనదేనని పురుషుడు అనుకోవడం వల్ల ఆ వత్తిడి కారణంగా అంగం స్తంభించదు. కొద్దిగా స్ధంభించినా యోని ప్రవేశానికి ఆ గట్టి దనం సరిపోదు. కంగారు పడి భారతీయ వయాగ్రాలను మింగకుండా అభ్యాసంతో ఈ సమస్యను అధిగమించవచ్చు. అంగస్ధంభన సమస్యకు ఈ వత్తిడి కాకుండా షుగర్, అధిక రక్తపోటు, స్మోకింగ్ వంటివి కూడా ఇతర కారణాలుగా కన్పిస్తున్నాయి. స్మోకింగ్ వల్ల పురుషాంగంలోకి వెళ్ళే రక్తనాళాలు కుంచించుకుపోయి ఎరక్షన్ సమస్య ఏర్పడుతుంది. పురుషాంగంలోకి రక్తం పంప్ కాకుండా ఎరక్షన్ కలుగదు. సిగరెట్లు మానేసినా మామూలు స్ధితికి రావడానికి సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు పడుతుంది.
అధిక కొలెస్టరాల్, అధిక బరువు కూడా పురుషత్వానికి శత్రువులే. అధిక బరువు ఉన్న వారిని సాధారణంగా మహిళలు బెడ్ మీద ఇష్టపడకపోవడానికి ఇదే కారణం. స్ధూల కాయులు యాక్టివ్ గా సెక్స్ లో పాల్గొనలేరు. కాబట్టి సహజ పద్ధతుల్లో శరీర బరువును తగ్గించుకోవడం మంచిది.