•  

కామసూత్ర: సుఖంలో కొత్తదనం

Monotany
 
ప్రేమ చిగురించిన కొత్తలో ఒకరినొకరు శారీరకంగా తెలుసుకోవాలనుకుంటారు. కొంతకాలం పాటు కాపురం చేసిన భార్యాభర్తల్లో ఆ ఉత్సుకత ఉండదు. సంభోగం కొంత కాలానికి పాత చింతకాయ పచ్చడిలా మారిపోయి విసుగు తెప్పించే ప్రమాదముంది. ఆ ప్రమాదం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోడానికి ఎన్నో చిట్కాలున్నాయి.

ఇలా అనుకోండి
మీరు మీ భాగస్వామి ఇప్పుడే కలుసుకున్నామనుకోండి. ఇద్దరూ ఆ విధంగా నటించండి. ఎంతో ధ్రిల్లింగ్ గా ఉంటుంది. ఇతరు చూస్తున్నట్టు మీ భాగస్వామిని ఆబగా గుడ్లప్పగించి చూడండి. అమె/ అతడు ఇంకా సెక్సీగా కన్పిస్తారు. ఇద్దరూ కొత్తవారిలా బిడియంగా నటిస్తూ మాట్లాడుకోండి. ఆ మాధుర్యం మళ్ళీ వచ్చి వాలుతుంది.

టీజింగ్
సరసం, చిలిపి చేష్టలను మించిన సెక్స్ టానిక్ మరొకటి ఉండదు. మీ భాగస్వామి హడావుడిగా ఆఫీసుకు వెళ్తున్నప్పుడు సడన్ గా ఆపి ఒక ముద్దు పెట్టుకోండి. ఒక మంచి మాటను హస్కీగా చెప్పండి. ఆ రాత్రికి ఎన్ని అద్భుతాలు జరుగుతాయో చూడండి.

భావోద్వేగం
కామ క్రీడలో పాల్గొనాలనిపిస్తే వెనకా ముందూ చూడకండి. భాగస్వామి మరో పనిలో బిజీగా ఉన్నా, మొహమాటపడుతున్నా ఆమెను లేదా అతడినిని మన్మధ సామ్రాజ్యంలోకి సుతిమెత్తగా లాక్కుని వచ్చేయండి. అమె లేదా అతని ఆఫీసుకు వెళ్ళి ఒక గంట ముందు బయటపడండి. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఎక్కైడైనా ఒక ఏకాంత గదికి వెళ్ళండి. మన్మధ సామ్రాజ్యంలో విహరించండి. చాలా కొత్త కొత్తగా మధురంగా ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అలా చేసుకోలనిపిస్తుంది. అంటే కొత్తదనం మహిత్యమన్నమాట అది.

టెక్నాలజీని ఉపయోగించండి
నవతరం జంటలకు ఈ-మెయిల్ కొత్త కాదు. మీ భాగస్వామిని ఉద్రేకపరిచే విధంగా ఒక మెసేజ్ లేదా ఒక కొటేషన్ పంపండి. లేదా మీరు చదివిన ఒక శృంగార కథని ఫర్వార్డ్ చేయండి. మొబైల్ లో కూడా సున్నితమైన సరసమైన మెసేజ్ లు అప్పుడప్పుడు పంపించండి. ఆ మెసేజ్ లు అశ్లీలంగా ఉండకుండా హుందాగా ఉండేలా చూసుకోండి.

ఇద్దరూ పనుల్లో బిజీ. బెడ్ రూమ్ లోనూ ఆఫీసు పని ఆలోచనలే. ఇక శృంగారంలో మజా ఏముంటుంది. అందుకే సడన్ గా ఇద్దరూ రెండు రోజులు సెలవు పెట్టుకుని ఎటైనా వెళ్ళిపొండి. ఏకాంతంగా ప్రకృతి సౌందర్యం మధ్య గడపండి. ఆటలు ఆడుకోండి. చెట్ల వైపు చూస్తూ ఒకరి ఒడిలో ఒకరు వాలిపోండి. ఆ తర్వాత నిజమైన మన్మధ సామ్రాజ్యంలో ఈతకొట్టండి. ఆ అనుభూతి కొన్ని నెలల వరకు ఉంటుంది.

Story first published: Friday, October 16, 2009, 11:24 [IST]

Get Notifications from Telugu Indiansutras