•  

ముద్దులలో రకాలు

ముద్దుముచ్చట
హృదయానికి ద్వారాలు కళ్ళు అయితే మెదడుకు పెదవులు. మన ఆలోచనలను బయటపెట్టేవి అవే కదా. ప్రేమను వ్యక్తీకరించాలన్న పెదవులే మనకు సాయం చేస్తాయి. ముద్దు-ప్రేమకు గొప్ప వ్యక్తీకరణ. ముద్దు ముచ్చట లేకపోతే ప్రేమ లేదని మన పెద్దలు అన్నారు. ముద్దు గొప్పతనం గురించి ప్రేమికులకు తెలుసు. ఇంకా దీని గురించి వివరించి మిమ్మల్ని బోర్‌ కొట్టించదల్చుకోలేదు. అయితే ముద్దులోని రకాలు గురించి ఇక్కడ ముచ్చటించుకుందాం.

'గీతాంజలి' ముద్దు  
ఇది స్వచ్భమైన భారతీయ ముద్దు. ముందుగా మీ లవర్‌ నుదటి మీద పెట్టుకోవాలి. తర్వాత నెమ్మదిగా కిందికి దిగండి. రెండు కన్నులపై మీ పెదాలను ఆన్చండి. ఆ తర్వాత ఎలాగూ ముద్దచ్చే బుగ్గలు సరేసరి. బుగ్గల తర్వాత గడ్డం(అంటే పెదాల కింద ఉండే భాగం) మీద పెట్టుకొండి. ఇక చివరగా, పెదవుల మీద పెదవులు...చేర్చి ముద్దు మీద ముద్దు పెట్టుకొండి. ఆ తర్వాత....నో..నో..ప్లీజ్‌.. అంతే..

ఫ్రెంచ్‌ ముద్దు  
ఫ్రెంచ్‌ దేశీయులు అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది వారి రోమాంటిక్‌ నేచర్‌. రోమాన్స్‌ లో వారు పెట్టింది పేరు. అందుకే అక్కడ కళలు అంతగా అభివృద్ధి చెందాయి. తొలిసారి ఫ్రెంచ్‌ వాళ్ళు కనిపెట్టిన ఫ్రెంచ్‌ కిస్‌ ముద్దులన్నింటిలోకి పాపులర్‌. ఎంతో ఇంటిమసీ ఉంటే తప్ప పెట్టుకోలేని ముద్దు. గీతాంజలి ముద్దు మాదిరిగా ఇందులో ఇంట్రడక్షన్స్‌ ఉండవు. డైరక్ట్‌ గా పెదాల మీద పెదాల ఆన్చి కిస్‌ మొదలు పెట్టాలి. మీరు తన్మయంలో ఉండగానే మీ నాలుకను మీ లవర్‌ నాలుకతో కలపండి. నాలుకలు పెనవేసుకొన్న వేళ...ఆహా...ఫ్రెంచ్‌ కిస్‌ మహిమ ఎమిటో తెలుస్తుంది. గుడ్‌ లక్‌...

Story first published: Thursday, July 31, 2008, 16:15 [IST]

Get Notifications from Telugu Indiansutras