స్ట్రోక్‌ రాకూడదంటే.....
సెక్స్‌ లో పాల్గొంటే హార్ట్‌ స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఉందని చాలామంది భావిస్తుంటారు. కానీ నిజానికి సెక్స్‌ లో సంతృప్తి (Orgasm) పొందిన మగవాళ్ళు హార్ట్‌ ఎటాక్‌ రాకుండా ఉండగలరని ఈ మధ్య పరిశోధనలో తేలింది. హృద్రోగం ఉన్న వాళ్లు ఎక్కువగా ఉద్రేకం చెందకూడదనేది నిజమే. కానీ వారానికీ మూడు సార్లు సెక్స్‌ లో 'సంతృప్తి' చెందిన మగవాళ్ళలో ఎటాక్‌ వచ్చే శాతం 60 శాతం తగ్గిందని ఈ మధ్య బ్రిటిష్‌ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ మధ్య వారు బ్రిటన్‌ లో జరిపిన ఓ పరిశోధనలో వెల్లడైంది. స్త్రీలలో కూడా అలానే ఉంటుందా అనేది ఇంకా తేలలేదు. ఒకటి మాత్రం నిజం. ఆరోగ్యకరమైన సెక్స్‌ జీవితం స్త్రీపురుషులిద్దరికీ ఎప్పుడూ మంచిదే అని వారు చెపుతున్నారు.
నయగారా
పురుషులకు వయగ్రా ఉంది. మంచిదే. మరి స్త్రీలు ఏమి పాపం చేసుకున్నారు. వారికి వయగ్రా అవసరం లేదా? ఇలా ఆలోచించిన ఓ స్వీడన్‌ సంస్థ ఇపుడు మహిళలకు ఓ ఉపకారం చేసింది. నయగారా(సారీ జలపాతం కాదండోయ్‌!) అనే కొత్త ఔషధాన్ని కనిపెట్టింది. బీరు లాగా ఉండే ఈ నయాగారా అమెరికాలో క్రేజ్‌ ను సృష్టిస్తోంది ప్రస్తుతం. గిన్‌ సెంగ్‌, స్కిజిండ్రా, కెఫిన్‌ పదార్థాలతో నయగారాను తయారుచేశారట. ఇది పుచ్చుకున్న వెంటనే స్త్రీలకు మైకం కమ్ముతుందట. అంతే ఆ తర్వాత స్వర్గమే. స్వర్గమే. నయగారా జలపాతం ముందు ఉన్నట్లు ఉంటుందట.