జీవితంలో సెక్స్ అత్యంత ముఖ్యమైంది. స్త్రీపురుషులు శృంగార క్రీడను ఫలానా సమయాన్నే సాగించాలని ఏమీ లేదు. అనువైన చోట, అనువైన సమయంలో రతిక్రీడను సాగించి ఆనందించాల్సిందేనని నిపుణులు చెబుతుంటారు. పగటి పూట లేదా ఉదయం సెక్స్ చేయకూడదని కొంత మంది నియంత్రించే ప్రయత్నం చేస్తుంటారు.
జీవితంలో తప్పకుండా అనుభవించాల్సింది ఉదయం పూట సెక్స్ అనందాన్ని అనేది నిపుణులు చెబుతుంటారు. మార్నింగ్ సెక్స్‌కు సంబంధించి మాక్సిమ్ మ్యాగ్జిన్ లో ప్రచురించిన ఈ అధ్యయనం వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తెల్లవారు జామున లేదా ఉదయం పూట శృంగారం ఎంతో ఆరోగ్యకరమైందని ఈ అధ్యయనంలో చెప్పారు.
రాత్రి పూట నిద్రతో రిలాక్సేషన్ పొందిన దేహానికి సహజంగానే తెల్ల వారే సరికి శృంగార వాంఛ పెరుగుతుందని, ఇది ప్రతి ఒక్కరికీ అనుభవమేనని అన్నారు. నిద్రతో లభించిన విశ్రాంతి కారణఁగా శృంగార సంబంధ హార్మోన్ల విడుదల పెరిగి కామకాంక్ష పెరుగుతుందని, అలాంటి సమయంలో కలయికతో సుఖానుభూతి లభిస్తుందని చెబుతున్నారు..

ఇది చాలా అనుకూలం..
శృంగార సామర్థ్యానికి కూడా ఉదయం చాలా అనుకూలమైన సమయమని అధ్యయనలో తేలింది. భావప్రాప్తి విషయంలోనే కాకుండా ఆరోగ్యరీత్యా కూడా ఇందులో చాలా ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. పైగా, దంపతుల మధ్య అనుబంధం మరింత పెరుగుతుంది. పగటి పనులను ఉల్లాసంగా చేయగలుగుతారని నిపుణులు కూా చెబుతున్నారు.

ఇలాంటి లాభాలు..
సమయానికి భోజనం చేయడం, తగినంతగా నిద్ర పోవడం, వారంలో ఐదు సార్లు వ్యాయామం చేయడంతో శరీర ఆరోగ్యానికి ఎన్ని లాభాలు కలుగుతాయో సూర్యుని లేఎండ తగిలే వేల శృంగారంతో అన్ని లాభాలు ఉంటాయని అధ్యయనంలో తేలింది.

స్లీపీ మార్నింగ్..
స్లీపీ మార్నింగ్ సెక్స్ అనేది మీకు మీరు ఇచ్చుకోగల బెస్ట్ థింగ్, లైఫ్ సేవింగ్ బెనిఫిట్ అధ్యయనం నివేదికలో చెపపారు. మార్నింగ్ సెక్స్ రక్తపోటును తగ్గిస్తుందని, గుండె పోటును అడద్డుకుంటుందని చెప్పారు. మార్నింగ్ సెక్స్ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ పనితీరు మెరుగుపడుతుందని, కోల్డ్ , ఫ్లూ వైరస్ లనుంచి రక్షణ లభిస్తుందని అందులో తెలిపారు.

ఇలా కూడా..
ఉదయం పూట సెక్స్ వల్ల ఆక్సిటోసిన్ ఉరకలు వేస్తుందని, ఇది ఫీల్ గుడ్ కెమికల్ అని శరీరానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని ఆ అధ్యయనంలో తేలింది. మార్నింగ్ సెక్స్ రోజును చాలా గొప్పగా మార్చేస్తుందని అంటున్నారు. డైలీ రొటీన్ నుంచి ఇది దంపతులను బయటపడేస్తుందని చెబుతున్నారు.