బ్రిటిష్ దంపతులు రతిక్రీడలో ఆగస్టు నెలలో రెచ్చిపోతారట. ఓ తాజా సర్వే ఫలితాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఏ నెలలోనూ లేనంతగా ఆగస్టులో వారు రతిక్రీడను ఊపేయడానికి తహతహలాడుతారని ఆ సర్వేలో తేలింది. సూర్యరశ్మి వల్ల సెరోటోనిన్, డోపమైన్ హార్మోన్ల స్థాయి పెరుగుతుందని, కామోద్వేగాన్ని పెంచే టెస్టోస్టరోన్ కూడా ఎక్కువగా విడుదలవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఆగస్టులో బ్రిటిష్ ప్రజలు తక్కువ దుస్తులు ధరిస్తారని, దాదాపుగా సెలవుల్లాగా ఉంటాయని, దాంతో వారు రెచ్చిపోవడానికి అనువైన మానసిక స్థితి కూడా ఏర్పడుతుందని అంటున్నారు. జనవరిలో కన్నా జూన్‌లో పురుషుల శరీరంలో 33 శాతం అధికంగా టెస్టోస్టెరోన్ విడుదలవుతుందని గత సర్వేలు తేల్చాయి. దానివల్ల పురుషులు ఎక్కువగా కామోద్రేకానికి లోనవుతారని చెబుతున్నారు.
ఆ ఫలితాలను ఆస్ట్రియాలోని గ్రాస్ వైద్య విశ్వవిశ్వద్యాలయం తాజా సర్వే కూడా బలపరిచింది. సూర్యరశ్మి వల్ల విటమిన్ డి స్థాయి పెరుగుతుందని, వేసవిలో పురుషుల్లో టెస్టోస్టెరోన్ పెరుగుతుందని పరిశోధనలు తేల్చాయి.
సూర్యరశ్మి కారణంగా టెస్టోస్టెరోన్ విడుదల పెరిగి కామోద్వేగ స్థాయి పెరుగుతుందని తేల్చారు. జులైలో కామవాంఛ అధికంగా ఉండే నెలలో రెండోదని, ఆగస్టులో ఉచ్చస్థితిలో ఉంటుందని లవ్హానీ సెక్స్ టాయ్ కంపెనీ సహకారంతో నిర్వహించిన సర్వేలో తేలింది. జూన్ మూడో స్థానం ఆక్రమిస్తుందట.
వేసవి కాలంలో పురుషులకు కామవాంఛ అధికంగా ఉంటుందని సర్వే తేల్చింది. మనుషులు తక్కువ దుస్తులు ధరిస్తారని, సూర్యుడు స్త్రీపురుషులను సంతోషంగా, సెక్సీగా ఉంచుతాడని పరిశోధన తెలియజేస్తోంది.
సెలవు దినాలు కూడా అధికంగా ఉంటాయి. దీంతో స్త్రీపురుషులు పనీపాటకు దూరమై మానసికంగానే కాకుండా భౌతికంగా కూడా తీరికగా ఉంటారు. దీంతో వారిలో శృంగార వాంఛలు ఎక్కువవుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఫిబ్రవరిలో ప్రేమికుల రోజు వస్తుంది. కానీ రతిక్రీడ పట్ల స్త్రీపురుషులు తక్కువ ఆసక్తి ప్రదర్శిస్తారట. చలికాలంలో అందరూ అనుకున్నట్లు ఎక్కువ కామవాంఛలు పుట్టవట. నిజానికి, ఫిబ్రవరి నెలను శృంగారం నెలగా పరిగణిస్తారు.
చలికాలంలో మనుషుల శరీరంలో మెలాటోనిన్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుందట. దానివల్ల కామోద్రేక స్థాయి తక్కువగా ఉంటుందని, బద్దకంగా కూడా ఉంటుందని పరిశోధనలో తేలింది.
రతిక్రీడ విషయంలో వాతావరణం ప్రముఖ పాత్ర వహిస్తుందని లాంకాస్టర్ విశ్వవిద్యాలయం ప్రొపెసర్ కారీ కూపర్ అంటున్నారు వాతావరణం బాగుంటే స్త్రీపురుషుల్లో, ముఖ్యంగా మహిళల్లో సెక్స్ కోరికలు పెరుగుతాయట.
వేసవి కాలంలో మహిళలు రతిక్రీడ పట్ల ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తారట. రకరకాల దుస్తులు ధరించే అవకాశం చిక్కడంతో వారి మనసు శృంగారం వైపు మళ్లుతుందని కూపర్ అంటున్నారు. సెక్సీగా కనిపించి, ఆహ్లాదంగా కనిపించడానికి మహిళలు ఈ కాలంలో ఆసక్తి ప్రదర్శిస్తారట.
పురుషుల కన్నా మహిళలే ఇతరులతో ఎక్కువగా కలిసిపోతారట. మాటలు కలుపుతారట. వారికి కావాల్సినప్పుడు ముదితలు ముద్దుగా వ్యవహరిస్తారట.
సూర్యుడి వెలుతురు మనస్సుల్లో ఆహ్లాదాన్ని పంచుతుందని, సెక్సీగా ఉంటారని ఫ్రాన్స్కు చెందిన సౌత్ బ్రిటనీ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.
ఎండ వేడి తగులుతుంటే మంచి మగాడు ఆకర్షణీయంగా కనిపిస్తే అమ్మాయిలు తమ ఫోన్ నెంబర్లు ఇవ్వడానికి ఏ మాత్రం వెనకాడరట. అంటే, వాతావరణం బాగుంటేనే వారి మూడ్ బాగుంటుందని చెప్పాలి.