స్త్రీపురుష సంబంధాల్లో మానసికపరమైన విషయాలు చాలా ఉంటాయి. మహిళను అర్థం చేసుకోవడం కష్టమని అంటారు. దానికి సమాధానం చెప్పుకోవడానికి అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే అని ఓ సినీ రచయిత అన్నాడు. కానీ, పురుషులతో మహిళలు మైండ్ గేమ్ అద్భుతంగా ఆడుతారని నిపుణులు అంటున్నారు.
పురుషుడు తన కొంగు పట్టుకుని తిరగాలని చాలా మంది మహిళలు అనుకుంటారట. పురుషులతో వారు ఆటాడుకుంటారు. పురుషునితో పనులు చేయించుకోవడం ద్వారా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుంటారని, అంతే కాకుండా తనకు ఎంత విలువ ఇస్తున్నాడనే విషయాన్ని పరీక్షకు పెట్టాలని అనుకుంటారని చెబుతున్నారు.
మహిళ తాను చెప్పిన పనిని పురుషుడు చేయకపోతే తన పట్ల అతనికి అనురాగం, ఇష్టం లేదని విసుక్కుంటుందట. మహిళ చెప్పే చిన్న చిన్న పనులు కూడా చేయకపోతే దంపతుల శృంగార జీవితం ఇబ్బందుల్లో పడుతుందని అంటారు. ఆమె చెప్పిన పనిని మొద్దబ్బాయిలా చేస్తే చాలా ఇష్టపడుతుందట. అతన్ని చిన్న పిల్లాడిలా బుజ్జగించి, అక్కున చేర్చుకుంటుందట.
కావాలని పురుషుడు మహిళ తన కోసం నిరీక్షించేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. తన పట్ల అతనికి గల ఆసక్తి ఎంతపాటిదో తెలుసుకోవడానికి ఇష్టపడుతుంది. తన కోసం పురుషుడు నిరీక్షిస్తే తనకు అతను ప్రాధాన్యం ఇస్తున్నట్లు భావిస్తుంది.
20, 30 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల్లో ఇది ఎక్కువని అంటున్నారు. ఆమె తన విషయంలో ప్రశ్నలు వేసి, అతని మనసును తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుందని చెబుతారు.
పురుషుడు తన పట్ల ఆసక్తి చూపిస్తున్నాడా, లేదా అని మహిళలు వయస్సుతో నిమిత్తం లేకుండా పరీక్షకు పెడుతారని అంటున్నారు. సంబంధం పెట్టుకున్న తొలి రోజుల్లో ఇది సర్వసాధారణం. అతనికి దూరంగా వెళ్తూ తన కోసం అతను ఎంతగా వెంపర్లాడుతాడో మహిళ గమనిస్తుందని అంటున్నారు.
చిన్ని పనుల విషయంలో కూడా తనకు తెలియదన్నట్లు మహిళలు నటిస్తారట. తనకు ఆ పని రాదని చెప్పి పురుషుడి సహాయం కోరుతుందట. ఉదాహరణకు - టీవీ రిమోట్ దగ్గరే పెట్టుకుని కనిపించడం లేదంటూ సహాయం కోరవచ్చు.