స్థూలకాయం మీ లైంగిక జీవితంపై ప్రభావం చూపుతోందా? శృంగారంలో అదరగొట్టడానికి అది సమస్యగా మారిందని భావిస్తున్నట్లుంటే కొన్ని పద్ధతులు పాటించడం అవసరం. స్థులకాయానికి ఆకర్షణకు కూడా సమాజంలో ఓ ప్రాధాన్యం ఉంది. స్థూలకాయం వల్ల లైంగిక పటుత్వం తగ్గడం, లైంగిక శక్తి నశించడం, హార్మోన్ల అసమతుల్యత వంటి ప్రతికూల లక్షణాలు మీద పడతాయి.
వివిధ రోగాలకు మీరు తీసుకునే మందులు కూడా స్థూలకాయానికి కారణం కావచ్చు. పొట్ట బరువు పెరగడానికి అవి కూడా కారణమవుతాయి. డయాబెటిస్, హృద్రోగాలు, హైపర్ టెన్షన్ వంటి ప్రతికూల ప్రభావాలు వాటి వల్ల పడే ప్రమాదం ఉంది. దీని వల్ల అంగస్తంభన సమస్య ఎదురు కావచ్చు. కామవాంఛ తగ్గే ప్రమాదం కూడా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్ల మంది స్థూలకాయానికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు. స్థూలకాయం సమస్యను వైద్యం ద్వారా ఎప్పుడో ఒకప్పుడు పరిష్కరించుకోవాల్సిందేనని అంటున్నారు. రతిక్రీడ వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది. శరీరం పటుత్వం సాధిస్తుంది. అయితే, స్థూలకాయం దానికి ఆటంకం కాకుండా చూసుకోవాలి. స్థూలకాయం సమస్యను పరిష్కరించుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంది.
అయితే, స్థూలకాయంతో బాధపడుతూ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఏ కాస్తా బరువును తగ్గించుకున్నా లైంగిక జీవితానికి సంబంధించి మెరుగైన ఫలితాలు రాబట్టుకోవచ్చు. ఇది లైంగిక జీవితాన్ని మెరుగుపరుచడమే కాకుండా మొత్తంగానే ఆరోగ్యం మెరుగు పడుతుంది. శరీరం బరువును తగ్గించుకోవడం మీ చేతుల్లో ఉందనే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని అందుకు తగిన ప్రయత్నాలు చేయడం అవసరం.
స్థూలకాయులు అంగస్తంభన సమస్యను ఎదుర్కుంటారు. జడత్వం కూడా రావచ్చు. హై కొలెస్టరాల్, హైపర్ టెన్షన్, డయాబెటిస్ వంటివి రక్తప్రసరణకు ఆటంకంగా మారుతాయి. పురుషాంగానికి కూడా ఆ సందర్భంలో రక్తప్రసరణ తగ్గి అంగస్తంభన సమస్య ఎదురు కావచ్చు. కాస్తా బరువు తగ్గినా సమస్యకు కొంత మేరకు పరిష్కారం లభిస్తుంది.
స్థూలకాయం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బ తింటుంది. ఇది స్తీపురుషుల్లో కామవాంఛను తగ్గించే ప్రమాదం ఉంది. శరీరంలో కొవ్వు పెరగడం వల్ల లైంగిక సంబంధమైన హార్మోన్ల విడుదల ఎక్కువగా జరగే అవకాశం ఉంది. దానివల్ల కూడా లైంగిక క్రీడపై ప్రభావం పడుతుంది.
స్థూలకాయం వల్ల మహిళల్లో సంతానప్రాప్తి కలగకపోవచ్చు. వారిలో విడుదలయ్యే అండాలు సంతానప్రాప్తికి అనుకూలంగా ఉండకపోవచ్చు. ఈ విషయాన్ని బ్రిగ్‌హామ్ వుమెన్స్ హాస్పిటల్ ఇన్‌పెర్టిలిటీ పరిశోధకులు తేల్చారు. దాంతో సంతానప్రాప్తి కలగకపోవడం, గర్భ విచ్ఛిత్తి జరగం వంటివి సంభవించవచ్చు. స్థూలకాయులైన పురుషుల అండాలు మహిళ గర్భం ధరించడానికి ఉపయోగపడకపోవచ్చు.
పొట్ట బరువుగా ఉన్నవాళ్లలో లైంగిక వాంఛలు తగ్గవచ్చునని అధ్యయనాల్లో తేలింది. రతిక్రీడపై అది ప్రభావం చూపుతుందని అంటున్నారు. అది శారీరకమైందే కాకుండా మానిసకమైందని కూడా చెబుతున్నారు.
కడుపు, చర్మాల్లో కొవ్వు అధికంగా పురుషుల్లో అంగం చిన్నదై పోవచ్చునని, కొన్నిసార్లు పూర్తిగా కుంచించుకుపోవచ్చునని అధ్యయనాల్లో తేలింది. ఇది రతిక్రీడపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.
ఇతరుల కన్నా స్థూలకాయులు తక్కువగా లైంగిక క్రీడలో పాల్గొంటారని పరిశోధనల్లో తేలింది. హై రిస్క్ సెక్సువల్ బిహేవయర్‌తో సతమతమవుతారని చెబుతున్నారు.
స్థూలకాయులు తమకు ఇష్టమైన భంగిమలతో ఆనందించే సౌకర్యం కూడా తక్కువగా ఉంటుంది. ఇద్దరు కూడా లావుగా ఉంటే కొన్ని రతిభంగిమలు ఆచరించడం సాధ్యమే కాదు. మిషనరీ భంగిమ అసలు సాధ్యమే కాదు. పొట్ట బరువు వల్ల అంగప్రవేశం కూడా లోతుగా జరగదు.
కళ్లు, శరీరం బరువును బట్టి సమాజం మనిషిని అంచనా వేస్తుంది. ఆకర్షణ వాటి రెండింటిపైనే ఆధారపడి ఉంటుంది. మన భారత సమాజంలో పురుషుడు కాస్తా బరువుగా ఉంటే పట్టించుకోరు గానీ మహిళలు స్థూలకాయులైతే పట్టించుకుంటారు. అటువంటి స్త్రీలకు వరుడిని అన్వేషించడం కూడా కష్టమే అవుతుంది.
స్థూలకాయులపై సమాజంలో కొన్ని స్థిరమైన అభిప్రాయాలున్నాయి. మందకొడిగా ఉంటారని, చలాకీతనం ఉండదని అనుకుంటారు. దానివల్ల స్థూలకాయమనేది ప్రధానమైన సమస్యగా మారుతుంది. ఈ ప్రతికూలమైన ఇమేజ్ వల్ల లైంగిక జీవితంపై కూడ ప్రభావం పడుతుంది.
స్థూలకాయులు కాస్తా చురుగ్గా కదలలేకపోవడమనేది ఉంది. దీని ప్రభావం రతిక్రీడపై కూడా పడుతుంది.