ప్రేమికుల రోజు దగ్గరపడుతోంది. మరి ప్రేయసితో మీ సమాగమం ఎలా ప్రణాళిక చేస్తున్నారు? మీ వద్ద ఏ రకమైన ప్లాను లేకుంటే, కొన్ని సులభమైన వేలంటైన్ రోజు ప్రణాళికలు ఇస్తున్నాం పరిశీలించండి.
రూమ్ అంతా ఎర్రగా - రోమాన్స్ ఎపుడూ ఎరుపే. కనుక మీ గది ఎర్రటి లైట్ తో వెలిగించండి. బెడ్ షీట్ కూడా ఎర్రని ఎరుపులో వేయండి. హృదయాకారపు కుషన్లు మరింత శోభనిస్తాయి. ఈ సెట్టింగ్ తో మీ హృదయరాణి ఎగిరి గంతులేస్తుంది.
మత్తెక్కించే సెంటెడ్ కేండిల్స్ - గదిలో సెంటెడ్ కేండిల్స్ వెలిగించి వుంచితే, మహిళలకు మరింత పరవశంగా వుంటుంది. బెడ్ పక్కన ఒకటి లేదా రెండు కేండిల్స్ పెట్టడం మరచిపోకండి.
గులాబీలు - ప్రేమికుల మధ్య గులాబీ పరమళాలు మంచి మూడ్ ఇస్తాయి. గులాబి రేకులు బెడ్ షీట్ పై చల్లండి ఆమె పడుకుంటే మీద పడేలా ఏర్పాటు చేయండి.
చాక్లెట్ - తియ్యగా కరిగిపోయే చాక్లెట్ నోటితో అందించి ఆనందించండి. చాక్లెట్లు ఎపుడూ రొమాంటిక్ బహుమతులే.
రొమాంటిక్ డ్యాన్స్ - డ్యాన్స్ లేకుంటే మజాయే లేదు. వచ్చిన సందర్భం కూడా డ్యాన్స్ లతో ఊగి పోయేదే. కనుక కొన్ని ప్రేమగీతాలు ఆలపిస్తూ లేదా మీ మ్యూజిక్ సిస్టంలో వేసి ప్రేయసి చేయి పట్టి ఆడేయండి.
ప్రేమికులరోజు నాడు ఈ రకమైన వినూత్న రీతిలో అద్భుతంగా ఆనందించి, మరచిపోలేని క్షణాలు పంచుకోండి.