•  

ముద్దు పెట్టు... కౌగిలి బిగించు!

 Kissing skills on Valentines Day!
 
మీరు ఆమె లేదా అతడి కళ్ళలోకి చూస్తున్నారు. వారు కూడా మీ కళ్ళలోకి చూస్తున్నారు. ఇద్దరూ ఒకే ఒక గాఢమైన ముద్దు కోసం అడుగులు ముందుకు వేశారు. ఆగిపోయారు. చేసేది సరైనదేనా? అసలా ముద్దు ఎలా పెట్టాలి అనే సందేహాలు వచ్చేశాయి. అటువంటపుడు....మరి కింది సూచనలు పాటిస్తే, మీరు పెట్టే ప్రతి ముద్దు ఎంతో తియ్యనైనదిగా వేలంటైన్ వేడుకలలో గుర్తుండిపోతుంది.

కళ్ళు...కళ్ళు కలపండి...- ఇద్దరు దగ్గరగా కూర్చున్నారు. ఇంకా దగ్గరైపోవాలనే కోరిక కలిగిపోతోంది.

కొంటె నవ్వు నవ్వండి - చిన్నపాటి, అర్ధవంతమైన చిరునవ్వు చాలు, అంతే ప్రతిఫలంగా ఆమె కూడా నవ్వేస్తుంది. ఆ చిరునవ్వుతో మీకు మరింత దగ్గరయ్యేటందుకు సిగ్నల్ దొరికినట్లే. అయితే, మెల్లగా దగ్గరవండి. ఎంత మెల్లగా ఆమెను చేతుల్లోకి తీసుకుంటే అంత కోర్కె పెరుగుతుందని భావించండి.

ముఖాన్ని స్పర్శించండి - ఈ చర్య ఇద్దరిమధ్య సనిహితాన్ని పెంచుతుంది. యువతి ముఖంపై పడే వెంట్రుకలు పైకి విసురుకుంటుంది. అపుడు ఆమె బుగ్గలు మీరు ముద్దాడండి.

రిలాక్స్ - ముద్దులు పెట్టే మీ పెదాలు రిలాక్స్డ్ గా వుంచండి. గట్టిగా బిగించేయవద్దు.

పెదాల తడి - మీ పెదాలు తడిగా వుండేలా చూడండి. ప్రేయసి వున్నపుడు రెగ్యులర్ గా మీరు పెదాలకు దట్టంగా ఏదైనా క్రీము వంటిది పట్టించి అవి మెత్తగా వుండేలా చూసుకోవాలి. మెత్తగా వుండే పెదాలు ఆమెకు ఆహ్వానం పలుకుతాయి. పురుషులైతే, మీ పెదాలు నాకకండి. కొద్దిపాటి ఒంపులో ఆమె పెదాలను గాఢంగా ముద్దాడితే చాలు.

కళ్ళు మూయండి - కళ్ళు మూసుకుని ముద్దు పెడితే, మరింత మధురంగా వుంటుంది. కోర్కె కలుగుతుంది.

తల యాంగిల్ - తలను ఒక యాంగిల్ లోకి వంపి పెదాలను పెదాలతో పట్టుకుంటే అన్నీ ఒకే లైనులో వుండి తేలికగా వుంటుంది. మిస్ అయ్యే అవకాశం వుండదు.

పెదాల అమరిక - పెదవులు మూయవద్దు, పూర్తిగా తెరువ వద్దు. ఎక్కువగా తెరిస్తే మీరు మింగేస్తారేమోనన్న భయం ఆమెకు వుంటుంది.

ముద్దు - ఇక అసలైన ముద్దు సీన్ కు వచ్చేశారు. మెల్లగా, సున్నితంగా మీ పెదాలతో ఆమె పెదాలను కలిపి గాఢంగా ముద్దిచ్చేయండి. వెంటనే వదిలేయకండి. కొంత సమయం ఆస్వాదించండి, ఆనందించండి. ఒక సారి తీసేస్తే, మరోసారి ఆమె కళ్ళలోకి చూడండి, చిరునవ్వుతో చిన్న కౌగిలి లేదా చెవిలో గుసగుసలాడి చెవిని పెదాలతో లైట్ గా టచ్ చేసి వదిలేయండి. చివరి చర్య ఆనందంగా జరిగితే అంతా ఖచ్చితంగా జరిగిపోయినట్లే.

English summary
Moisturise your lips Make this a rule when you are in a relationship, both men and women. Keep your lips soft by regular application of lip balm, so when the moment comes, it's soft and supple lips that greet your partner's. Men should avoid licking their lips or else you could just land a sloppy kiss.
Story first published: Tuesday, January 31, 2012, 16:42 [IST]

Get Notifications from Telugu Indiansutras