ఈ రీసెర్చిలో సుమారు 96 మంది పురుషులను 102 మంది మహిళలను సర్వే చేశారు. వీరిని పురుషులతో 3 నుండి 5 నిమిషాలపాటు అతి త్వరగా కలసి సంభాషించమని కోరారు. సంభాషణలకు ముందే అందులో పాల్గొన్నవారు వారి వారి ఆకర్షణలను బట్టి కొద్ది సమయం రతిక్రీడల స్ధాయికి కూడా అంచనాలు వేశారు. ప్రతి మీటింగ్ తర్వాత వారు తమ పార్టనర్ ను అనేక రకాలుగా రేటింగ్ చేశారు. శారీరక ఆకర్షణ, రతి ఆసక్తి కూడా పరిగణించారు.
అతి త్వరగా సెక్స్ ఆచరించాలనుకునే పురుషులు మహిళలు ఏది మాట్లాడినప్పటికి వారు రతికే ఆరాటపడుతున్నారని భావించారు. పురుషులు తాము హాట్ గా వున్నామనుకునేవారు మహిళలు కూడా హాట్ అని భావించారు. కాని మహిళల రేటింగ్ మేరకు ఆకర్షణీయంగా వున్నవారు మాత్రం ఈ రకమైన తప్పు చేయలేదు.
పురుషుడికి మహిళ ఎంత ఆకర్షణీయంగా వుంటే, అతను అంతగా ఆమెకు రతిలో ఆసక్తి వుందని భావిస్తున్నాడనేది తేలింది. మహిళలు సైతం పురుషుల కోర్కెలను తక్కువగానే అంచనా వేశారు. ఈ పరిశోధన ఫలితాలు అసోసియేషన్ ఫర్ సైకలాజికల్ సైన్స్ సంస్ధ ప్రచురించే జర్నల్ సైకలాజికల్ సైన్స్ అనే దానిలో ప్రచురిస్తున్నారు.