రాత్రి తొలి జామున సాధారణంగా అందరూ సెక్సులో పాల్గొంటారు. ఇది స్త్రీ, పురుషులకు సౌకర్యంగా ఉన్నప్పటికీ అది మాత్రం సరైనది కాదని డాక్టర్లు అంటున్నారు. సెక్సులో పాల్గొనే ముందు కడుపు ఖాళీగా ఉండాలి. అప్పటికే తిన్న ఆహారం జీర్ణమై ఉన్నట్లయితే సెక్సు ఎలాంటి అనారోగ్యానికి కారణం కాదు. అయితే చాలామంది పడుకునే ముందు తింటారు. కాబట్టి పడుకోగానే సెక్సులో పాల్గొనకుండా కొన్ని గంటలు ఆగి పాల్గొంటే మంచిదని చెబుతున్నారు. అలా చూసుకుంటే ఆర్ధరాత్రి ఒకటి లేదా రెండు గంటల ప్రాంతంలో సెక్సులో పాల్గొంటే మంచిది. ఎందుకంటే అప్పటికే పడుకునే ముందు తిన్న ఆహారం జీర్ణమవుతుంది కాబట్టి.
సెక్సు తర్వాత కూడా ఆకలి అవుతుంది. కాబట్టి ఆ సమయంలో కాస్త తీపి తీసుకుంటే మంచిది. చక్కగా వేడి చేసిన పాలను ముందే ప్లాస్కులో ఉంచుకొని ఇద్దరూ తాగాలి. అది ఎంతో మంచిది. అయితే సెక్సుకు ముందు మాత్రం ఏమీ తినకూడదు. ఇద్దరూ మూత్ర విసర్జన చేసుకోవడం వల్ల శీఘ్ర స్కలనాలు నివారించబడుతాయి. తీపి తినటం వల్ల మూత్రం మంట పెట్టదు. వయస్సు మళ్లిన వారికి రాత్రి తొలిజాముల్లో అంగ స్తంభనం బలహీనంగా ఉండి వేకువ జామున ఆంగస్తంభం బలంగా ఉంటుంది.
కాబట్టి అలాంటి వారు ఉదయాన్నే సెక్సు చేస్తే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. అయితే వీరు సెక్సుకు ముందు మూత్ర విసర్జన చేయకూడదంట. పగలు సెక్సులో పాల్గొనకూడదనే అపోహలు ఉన్నాయి. కానీ అది నిజం కాదు. పగలూ సెక్సులో పాల్గొనవచ్చు. అయితే తిన్న తర్వాత మాత్రం పాల్గొనకూడదు. తిన్నాక రెండు మూడు గంటల సమయం ఇవ్వాలి.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.