•  

సెక్స్ కు ప్రేరేపించడమెలా?

Prepare for Sex
 
కొంతమంది దంపతులు తమకు తగినంత లైంగిక ఆనందం కలగడం లేదనీ, అసలు తన భాగస్వామిని ఎంత ప్రేరేపించినా సెక్స్ స్పందనలు కలుగడం లేదని బాధపడిపోతుంటారు. నిజానికి ఇది లైంగిక పరమైన సమస్య కాదు. దానికి ఇతర సమస్యలు కారణమై ఉంటాయి. ఒకరు సెక్స్‌కి సిద్ధపడి రెండోవారు అది ఇప్పుడు ఇష్టం లేదు అని అంటున్నారంటే, దాని వెనుక మరేదో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. పడక గదికి చేరిన తర్వాత మనసులో సెక్స్ కోరికలు తప్ప మరే కోరికలకు చోటు కల్పించకూడదు. అలా ఉండటానికి ఇద్దరూ ప్రయత్నించాలి. ఏవైనా సమస్యలుంటే పడక గది బయటే చర్చించుకుని వాటికి అక్కడే ఫుల్‌స్టాప్ పెట్టేయాలి. ఆ సమస్యలను చర్చించేందుకు సెక్స్ సమయాన్ని వాడుకోకూడదు. ఆనందకరమైన, సంతృప్తికరమైన సెక్స్ అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది.

భాగస్వామిలో సెక్స్ అలజడులను రేపేందుకు ఎక్కడ స్పర్శిస్తే ఆమె/అతడిలో స్పందన వస్తుందో తెలుసుకుని సున్నితంగా స్పర్శించడం మొదలు పెట్టాలి. అలా నెమ్మదిగా వారిని సంసిద్ధులను చేసి పూర్తి స్థాయి సెక్స్‌కు తీసుకెళ్లవచ్చు. అంతేకాదు లైంగిక కబుర్లను చెప్పడం కూడా సెక్స్ కోర్కెల ద్వారాలను తెరువవచ్చు. సెక్స్ తృప్తి అనుభవించిన జంటల్లో మానసిక ఆందోళనలు కానరావు. అంతేకాదు పూర్తి ఆరోగ్యానికి కూడా సెక్స్ మంచి మందు అంటున్నారు సెక్సాలజిస్టులు.

Story first published: Saturday, October 23, 2010, 15:29 [IST]

Get Notifications from Telugu Indiansutras