•  

స్త్రీలలో సుదీర్ఘ భావప్రాప్తి!

Longer Orgasm in Females
 
భావప్రాప్తి సమయంలో స్ర్తీ హావభావాల్లో వచ్చే మార్పులను పురుషుడు నిశితంగా గమనించాలి. నిర్ణీత సమయం రతి జరిపిన తర్వాత ఆమె ముఖ కవళికల్లో మార్పులు వస్తాయి. కాళ్ళు, చేతుల కండరాలు బిగుసుకుంటాయి. మెడపైన, భుజంపైన కొందరికి ఎర్రటి రాష్ లు కన్పించి కొన్ని నిముషాలకే అంతరించిపోతాయి. భావోద్వేగం పతాక స్ధాయిలో ఉన్నప్పుడు పిడికిళ్ళను బెడ్ మీద గట్టిగా అదమడమో, పురుషుడిని గట్టిగా పెనవేసుకోవడమో జరుగుతుంది. భావప్రాప్తి పొందిన వెంటనే కండరాల బిగువు ఒక్కసారిగా సడలుతుంది. భావప్రాప్తి సమయంలో ఉచ్వాస నిశ్వాసాల వేగం పెరుగుతుంది. మామూలు కంటే రెట్టింపు అవుతాయి.

పురుషుడు వీటన్నిటినీ ఎందుకు పరిశీలించాలంటే అతనికి ఆమె భావప్రాప్తి పొందడం ముఖ్యం కాబట్టి. ఆమె క్లెయిమాక్స్ కు వస్తున్న కొద్దీ అతను మరింత బాధ్యతతో వ్యవహరించాలి. ప్రయాణికులను చివరి పెట్రోలు చుక్కలతో గమ్య స్ధానానికి చేర్చాల్సిన బాధ్యత డ్రైవర్ కు ఉన్నట్టే ఇది కూడా. ఆ సమయంలో ఆమె బలమైన స్ట్రోక్స్ కోరుకున్నప్పటికీ అతను ఆవేశపడిపోకూడదు. అతను నిలకడగా ఆమెను సుఖాల తీరానికి తీసుకెళ్ళిన తర్వాతే తాను భావప్రాప్తి పొందాలి. పురుషుడికి ఒక్కసారే అంటే స్కలనం సమయంలో కొన్ని సెకన్ల పాటే భావప్రాప్తి కలుగుతుంది. మహిళల్లో అలా కాకుండా అలలు అలలుగా భావప్రాప్తి కలుగుతుంది. మరికొందరు స్త్రీలలో సుదీర్ఘంగా ఇరవై నుంచి అరవై క్షణాల సేపు ఏకబిగిన భావ ప్రాప్తి కలుగుతుంది. ఆ సమయంలో వారు సొమ్మసిల్లిపోయినట్టు కన్పిస్తారు.

Story first published: Wednesday, April 7, 2010, 17:14 [IST]

Get Notifications from Telugu Indiansutras