
అందాల హెలికోనియా...వన్నెలొలికే హెలికోనియాలోని విభిన్న తరహాలు వేటికవే అద్భుతంగా, మనోహరంగా వికసిస్తాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అందరినీ ఆకర్షనీయంగా ఆకట్టుకొంటున్న రకాలు జింజర్ హెలికోనియాలోని లేత గులాబీరంగు ముద్దపూలు. ఇది దుంప రకం మొక్క. తేమ, వేడి ఉంటే చాలు వీటిని పెంచడం చాలా తేలిక. ఇది పెరీనియల్ రకం. అంటే సంవత్సరమంతయూ పచ్చగా, గుబురుగా, పొదలాగా వికసిస్తూ ఉంటుంది.
అల్లం మాదిరిగా మొక్క అడుగున దుంప విస్తరించి ఏడాదిలో ఐదారు కొత్త మొక్కలు వస్తాయి. రోజులో ఒక్కసారి నీళ్లుపోస్తే చాలు, నాలుగు రోజుల పాటు తేమను గ్రహిస్తాయి. వికసించిన ప్రతి పువ్వూ కనీసం పది రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఒకదానికి తర్వాత ఒకటి ఏడాది పొడవునా పూలు పూస్తూ కళకళలాడుతుంది. ఇవి కట్ ఫ్లవర్స్ గా బాగా ఉపయోగపడగాయి. అంటే ప్లవర్ వాజుల్లో ఉంచడానికి, బొకేలు చేయడానికి, పెళ్లి పందిళ్లు అలంకరించడానికి, స్టార్ హోటళ్లలో స్వాగతం పలకడానికి ఇవెంతో ఉపయోగపడతాయి. కట్ చేసి ఫ్లవర్ వాజులో ఉంచినా పది రోజులు తాజాగా ఉంటాయి.
ఇంటిని పచ్చగా, చల్లగా ఆహ్లాదంగా ఉంచుకోవాలనుకొనేవారు పూలతోటలో గోడలకి పక్కగా పెంచుకోవాలి. శీతాకాలంలో రోజుకి ఒక్కసారి..ఎండాకాలంలో రెండు సార్లు నీటిని పెట్టాలి. అడుగున దుంప నీటిని దాచిపెట్టుకొంటుంది. ఎంతగా కట్ చేస్తూ ఉంటే అంతగా కొత్త మొక్కలు వస్తూ ఉంటాయి..12రకాలుగా ఉన్న ఈ మొక్క ల్యాండ్ స్కేపింగ్ ని అందించే నర్సరీల్లో ఇవి దొరుకుతాయి. అల్లం లాంటి విత్తనాల రూపంలో దొరుకుతాయి...



Click it and Unblock the Notifications



