•  

గర్భవతికి సెక్స్ సురక్షితమా?

Is Sex safe for a Pregnant Woman?
 
గర్భవతి సాధ్యమైనంతవరకు విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతితోపాటు మంచి పోషక విలువలు కల ఆహారం కొద్దిపాటి వ్యాయామం అవసరం. భర్తతో చక్కటి అనుబంధం ఏర్పరచుకోవాలి. శరీరంలో వచ్చే మార్పులను అంగీకరించాలి. స్తనాలు సైజులో పెద్దవి అవుతాయి. పొట్టపై గుర్తులు పడటం మొదలవుతుంది. అవసరాన్నిబట్టి శరీరానికి మాసేజ్ చేయించండి.

బ్రాసరీలు వంటి దుస్తులను శరీరానికి తగ్గట్లు ఎప్పటికపుడు సైజులు మారుస్తూ సౌకర్యవంతంగా ధరించాలి. గర్భవతి తన రెండవ త్రైమాసికంలో కూడా రతిక్రీడలాచరించటానికి చాలా సురక్షితం. సెక్స్ లో ఏ మాత్రం అసౌకర్యంగా వున్నా డాక్టర్ ను సంస్రదించండి. పొట్టపై ప్రత్యేకించి పొత్తికడుపు భాగం లేదా కడుపులో పిండానికి ఒత్తిడి పడకుండా ఇతర భంగిమలలో రతిక్రీడ చేయటంలో హాని కలుగదు. అయినప్పటికి, మూడవ త్రైమాసికంలో రతిచర్యలు నిలుపు చేసుకుంటే, మహిళకు, పుట్టబోయే బిడ్డకు ఆరోగ్యం బాగుంటుంది.

వైద్యులను సంప్రదించేటపుడు మీ భాగస్వామి కూడా వెంట వుంటే, అవసరమైన జాగ్రత్తలు వివరంగా తెలుసుకొని ఆచరించవచ్చు.

English summary
Understand and accept your bodily changes. Your body is changing. Your breasts are bigger, stretch marks have started to appear and you have put on weight around your middle. Accept and enjoy these little joys of motherhood!
Story first published: Saturday, November 5, 2011, 15:11 [IST]

Get Notifications from Telugu Indiansutras