•  

సెక్స్ తర్వాత ఇక ఏమీ లేదా: అయితే అవుటే...

రతిక్రీడ ముగిసిన తర్వాత అంతా అయిపోయిందని కొందరు అనుకుంటారు. సెక్స్ పూర్తికాగానే ఎవరికి వారు పక్కకు తిరిగి పడుకుంటారు. అది సరైన పద్ధతి కాదని అంటున్నారు నిపుణులు. దంపతుల మధ్య బంధం గట్టి పడాలంటే రతిక్రీడ ముగిసిన తర్వాత చేయాల్సిన పనులు ఉంటాయి.

పురుషులైతే స్కలనం జరిగి సంభోగం పూర్తయిన తర్వాత తన భాగస్వామిని పట్టించుకోకుండా పక్కకు తిరిగి పడుకుంటారు. అది స్త్రీని తీవ్ర నిరాశకు గురి చేస్తుందని అంటారు. సెక్స్ తర్వాత సమయం చాలా విలువైంది.

మీరు ప్రేమిస్తున్నవారి పక్కన మీరు పడుకుంటున్నారు కాబట్టి ఆ సమయం చాలా ముఖ్యమైంది. వెంటనే నిద్ర పోవడానికి బదులు మీ జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని పంచుకోండి.

సెక్స్‌ ముగిసిన తర్వాత....

సెక్స్‌ ముగిసిన తర్వాత....

రతిక్రీడను పూర్తి స్థాయిలో ఆస్వాదించిన తర్వాత తప్పకుండా మీ శరీరంలోని కొన్ని కాలరీల శక్తి తగ్గిపోతుంది. ఆ సమయంలో మీకు ఆకలి కావచ్చు. వెంటనే మినీ మీల్‌ను సిద్ధం చేసుకుని పడకపై మీ జీవిత భాగస్వామితో కలిసి ఆరగించండి.

బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి.....

బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి.....

రతిక్రీడ తర్వాత మీరిద్దరు మంచి మూడ్‌లో ఉంటారు. మీ బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఇంతకన్నా మంచి సమయం ఏదీ ఉండదు. మీ జీవితంలోని మధురమైన శృంగారపరమైన జ్ఞాపకాలను పరస్పరం నెమరేసుకోండి. జోక్‌లు కట్ చేసుకుంటూ మీ మధ్య జరిగిన కయ్యాలను కూడా చెప్పుకోండి.

కలిసి స్నానం చేయండి....

కలిసి స్నానం చేయండి....

రతిక్రీడ ముగిసిన తర్వాత కలిసి స్నానం చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. హాట్ టబ్‌లో పక్కపక్కన పడుకుని జలకాలాడండి. కలిసి మౌనంగా స్నానం చేయడం కూడా కొన్ని సార్లు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.

ఇలా సెల్ఫీలు....

ఇలా సెల్ఫీలు....

కారణం లేకుండా అడ్దదొడ్డంగా సెల్పీలు తీసుకోవడానికి బదులు రతిక్రీడ ముగిసిన తర్వాత హ్యాపీమూడ్‌లో ఉన్నప్పుడు సెల్ఫీలు తీసుకుంటూ ఆనందించండి. ఆ సెల్ఫీలు భవిష్యత్తులో కూడా ఆనందాన్ని ఇస్తాయి. అప్పుడిలా చేశాం కదా అని గుర్తు చేసుకుని మురిసిపోవడానికి పనికి వస్తాయి.

బద్దకంగా ఉంటే.....

బద్దకంగా ఉంటే.....

రతిక్రీడ ముగిసిన తర్వాత పడక మీంచి లేవడానికి బద్దకంగా అనిపిస్తే దుప్పటి కప్పుకుని ఇరువురికీ ఇష్టమైన సినిమాను టీవీలో పెట్టుకుని చూడండి. ఆ సమయంలో దుప్పటి లోపల కౌగిలించుకోండి, ముద్దులు పెట్టుకోకండి.

మసాజ్ బాగా పనికి వస్తుంది....

మసాజ్ బాగా పనికి వస్తుంది....

రతిక్రీడ ముగిసిన తర్వాత ఇరువురు పరస్పరం మసాజ్ చేసుకుంటే ఎంతో ఊరట లభిస్తుంది. దానికి తోడు టచీగా కూడా ఉంటుంది. బాడీ మసాజ్ లేదా హెడ్ మసాజ్ వల్ల ఓ లయాత్మక క్రీడ కొనసాగుతుంది. తద్వారా రెండోసారి రతిక్రీడకు సిద్ధం కావచ్చు.

 

English summary
The time immediately after having sex is precious. Instead of sleeping and losing out on this interval, here are six super-romantic things to make your night.
Story first published: Thursday, June 22, 2017, 15:56 [IST]

Get Notifications from Telugu Indiansutras