•  

ఫస్ట్ టైమ్ సెక్స్‌లోకి దిగినప్పుడు ఇలా....

తొలిసారి సెక్స్‌లో పాల్గొనే సందర్భం వచ్చినప్పుడు చాలా మంది ఆందోళనకు గురవుతుంటారు. తన భాగస్వామిని సంతోష పెట్టగలుగుతానా, లేదా అనే సందేహం వల్ల కలిగే ఆందోళన అది. అయితే, తొలిసారి సెక్స్ చేసినప్పుడు కొన్ని మెలుకువలను పాటిస్తే ఆ తర్వాత లైంగిక జీవితం సజావుగా కొనసాగుతుంది.

తొలిసారి రతిక్రీడ చేసినప్పుడు జంటకు కొంత మేర గాయం అవుతుంది. అది రతిక్రీడలో ఆనందాన్ని ఇవ్వవచ్చు గానీ కొన్నిసార్లు చిరాకు పరుస్తుంది కూడా. ఎక్కువగా గాయపడితే ఆ తర్వాత సెక్స్ చేయడానికి భయపడే పరిస్థితి కూడా రావచ్చు.

సరైన అవగాహన లేకుండా తొలిరాత్రి సెక్స్‌లో పాల్గొంటే అది తర్వాతి లైంగిక జీవితాన్ని దెబ్బ తీసే ప్రమాదం ఉంది. తొలిరాత్రి సజావుగా, ఆనందంగా గడిచిపోవాలంటే కొన్ని మెలుకువలు పాటించాలి.

సరైన అవగాహన లేకుండా మొట్టమొదటిసారి రతిక్రీడ చేస్తే ఎంతో చికాకుగాను అసంతృప్తిగాను వుంటుంది. కనుక మొదటిసారి రతిక్రీడ చేసుకునే వారు ప్రధానంగా 6 అంశాలు గమనించాలి.

ఎక్కువగా ఆశించవద్దు...

ఎక్కువగా ఆశించవద్దు...

మొదటి రతిక్రీడ ఎంతో మధురంగా ఎప్పటికి మరచిపోలేనిదిగా ఉండాలని అందరూ అనుకుంటారు. శోభనం రాత్రి ఆనందం మధుర జ్ఞాపకంగా ఎల్లకాలం ఉండాలని అనుకుంటారు. అయితే, మొదటి రాత్రి పూర్తి స్థాయిలో సెక్స్‌ అనుభూతిని పొందడానికి వీలు కాకపోవచ్చు. అనుభవం మీద సెక్స్‌లోని మాధుర్యాన్ని జుర్రుకోగలుగుతారు. అందుకని మొదటి రాత్రి ఎక్కువగా ఆశించకపోతే నిరాశ మిగలదు.

ఫోర్ ప్లే ప్రధానం...

ఫోర్ ప్లే ప్రధానం...

తొలిసారి రతిక్రీడలో పాల్గొనడానికి సిద్ధపడ్డవారు ఆతురత పడే అవకాశం ఉంది. సంభోగం మాత్రమే రతిక్రీడగా భావించే అవకాశం ఉంది. అయితే, సంభోగానికి త్వరపడకుండా ఫోర్‌ప్లేకు ప్రాధాన్యం ఇవ్వండి. మీ జీవిత భాగస్వామి అంగాంగాలను స్పర్శించడం, ముద్దులు పెట్టుకోవడం వంటివి ఫోర్‌ప్లే కిందికి వస్తాయి. మీ జీవిత భాగస్వామి అందాలను, వ్యక్తిత్వాలను ప్రశంసించడి. పూర్తి స్థాయిలో నిలువరించుకోలేని స్థితికి చేరుకున్న తర్వాత సంభోగానికి సిద్ధపడండి. తగిన విధంగా సంసిద్ధం కాకపోతే జననాంగాలు రాపిడికి గురై, నొప్పికి గురి చేసే ప్రమాదం ుంది.

మొదటిసారే ఎవరూ నేర్పరులు కారు...

మొదటిసారే ఎవరూ నేర్పరులు కారు...

పురుషులు తమకు అన్నీ తెలుసు అనే పద్ధతిలో వ్యవహరిస్తారు. నేర్పరితనాన్ని మొదటిసారే ప్రదర్శించాలని చూస్తారు. తమకు తెలియదని చెప్పడాన్ని నామోషీగా భావిస్తారు. అందువల్ల ఇరువురు సరైన అవగాహనతో ముందుకు రావడం మంచిది.

ఇలా చెప్పవద్దు...

ఇలా చెప్పవద్దు...

భాగస్వామిని సంతోషపెట్టడానికి తాము సెక్స్‌లో సంతృప్తి చెందామని చెబుతుంటారు. అసంతృప్తికి లోనై అంచనాకు కూడా రావద్దు. తొలిసారి అసంతృప్తికి గురైతే తాము పూర్తి స్థాయిలో సంతృప్తి చెందడానికి మరసటి కలయికలో ఎలా వ్యవహరించాలో ఆలోచించుకోండి. అందుకే, వెంటనే సంభోగానికి సిద్ధపడకూడదని అంటారు. కొన్ని సార్లు తొలి కలయికలో అంగప్రవేశం కూడా జరగకపోవచ్చు. అంత మాత్రాన అసంతృప్తికి గురి కావాల్సిన అవసరం లేదు. తన పురుషుడి పట్ల స్త్రీ ఇలాంటి సందర్భాల్లో అసంతృప్తికి గురై తర్వాతి కలయికకు విముఖత ప్రదర్శించకూడదు. తర్వాత కలయికలో అంగప్రవేశం సరిగా జరగడానికి సహకరిస్తే బాగుంటుంది.

భావప్రాప్తి తొలి కలయికలో...

భావప్రాప్తి తొలి కలయికలో...

రతిక్రీడలో భావప్రాప్తి పొందాలని స్త్రీపురుషులు ఇద్దరూ ఆశిస్తారు. కానీ, తొలి కలయికలో అది సాధ్యం కాకపోవచ్చు. అది సాధ్యం కాకపోయినా ఆనందాన్ని పొందవచ్చు. తొలిసారి అలాంటి భావప్రాప్తి కలగనప్పుడు తర్వాతి కలయికల్లో జాగ్రత్తలు తీసుకుని భావప్రాప్తి పొందడానికి తగిన వాతావరణాన్ని మాత్రమే కాకుండా పరస్పర సహకారం అందించుకోవడం అవసరం.

 

English summary
Man and woman should take few precautions in the sex to make first night as sweet memory
Story first published: Thursday, June 8, 2017, 16:29 [IST]

Get Notifications from Telugu Indiansutras