•  

పోర్న్‌కు బానిసలయ్యారా: సెక్స్ లైఫ్ గోవిందా...

ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పోర్న్ చూడడం చాలా మంది చేస్తూనే ఉంటారని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. చాలా మంది దొంగచాటుగా పోర్న్ చూస్తుంటారు.

మద్యానికీ, స్మోకింగ్‌కు అలవాటు పడినట్లుగానే పోర్న్‌కు అడిక్ట్ అయినవాళ్లూ ఉన్నారు. అది శృంగార జీవితంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నట్లు అధ్యయనంలో తేలింది.

పోర్న్‌కు అలవాటు పడినవారి శృంగార జీవితం తీవ్రమైన ప్రభావానికి లోనవుతున్నట్లు కూడా భావిస్తున్నారు. పోర్న్‌కు అలవాటు పడినవారు రోమాంటిక్ రిలేషన్‌షిప్‌నకు తాము పనికి రామనే భావనకు కూడా గురవుతుంటారట.

పోర్న్‌కు అలవాటు పడితే....

పోర్న్‌కు అలవాటు పడితే....

మీరు పోర్న్‌కు అడిక్ట్ అయ్యారంటే సంబంధాన్ని ప్రారంభించడం పట్ల, దాన్ని కొనసాగించడం పట్ల తీవ్రమైన ఆవేశానికి లోనపుతారని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. రోమాంటిక్ పార్ట్నర్‌గా తాము పనికి రామనే భావనకు మీరు లోనవుతుంటారని అధ్యయనం చేసిన నాథన్ లియోన్‌హాడ్త్ అంటున్నారు.

అది మరింతగా...

అది మరింతగా...

పోర్న్‌కు అలవాటు పడినవారు దాన్ని నియంత్రించుకోవాలని, ఆపేయాలని అనుకోవడంలోమరింత ఒంటరితనానికి గురవుతారని, రహస్యాన్ని దాచిపెట్టేస్తూ రావడం వల్ల అది ప్రతికూల ఫలితాలు ఇస్తుందని కూడా అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు సెక్స్ రీసెర్చ్ బుక్‌లో ప్రచురితమయ్యాయి.

అంగీకరించేవారు...

అంగీకరించేవారు...

తాను పోర్న్‌కు అలవాటు పడినట్లు అంగీకరించేవారు తన పోర్నోగ్రఫీ వాడకం వల్ల తాను డేటింగ్‌కు పనికి రానని కూడా అంగీకరిస్తారట. పోర్నోగ్రఫీ వాడుతున్నప్పుడు తాను డేటింగ్‌ను ఆపేస్తానని కూడా చెబుతారట. పోర్నోగ్రఫీ వాడుతున్నట్లు చెప్తే తన జీవిత భాగస్వామి నుంచి వ్యతిరేకత వస్తుందని భయపడుతారట.

నమ్మకం వల్ల కూడా...

నమ్మకం వల్ల కూడా...

సంప్రదాయబద్దమైన నమ్మకాలు కూడా పోర్నోగ్రఫీ చూడడాన్ని తప్పుగా భావిస్తుంది కాబట్టి పోర్న్ చూస్తున్నవాళ్లు తీవ్రమైన సంఘర్షణకు లోనవుతారని, అది సెక్స్ జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు. నైతికమైన తప్పుగా భావించడం వల్ల డిప్రెషన్, సిగ్గరితనం వంటి ప్రతికూల ప్రభావాలు పడుతాయని ఆ అధ్యయనంలో తేలింది.

 

English summary
As per researchers, if you are aware of yourself as a porn addict then this very fact can make you more anxious about starting and continuing a relationship.
Story first published: Wednesday, May 3, 2017, 15:07 [IST]

Get Notifications from Telugu Indiansutras