•  

సెక్స్‌లో ఈ తప్పు చేస్తున్నారా?: అయ్యో!

అనుభవాల నుంచి నేర్చుకోవాలని అంటారు. అదే సమయంలో తప్పులు చేస్తేనే నేర్చుకోవడానికి వీలవుతుందని కూడా చెబుతుంటారు. శృంగారంలో కూడా ఇదే వర్తిస్తుంది. సెక్స్‌లో మీరు చేసే తప్పుల వల్ల మీ జీవిత భాగస్వామిని సంతోషపెట్టలేకపోగా, మీరు కూడా క్రమంగా అసంతృప్తికి గురయ్యే స్థితికి చేరుకునే ప్రమాదం ఉంది.

సెక్స్ విషయంలో మీ జీవిత భాగస్వామిని కూడా పరిగణనలోకి తీసుకుని ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. సెక్స్ రోటీన్‌గా మారిపోయి, ఏదో కానిచ్చేశమనే పద్ధతి పనికి రాదు. ఇరువురి మధ్య బంధం గట్టిపడాలంటే మీరు మాత్రమే కాకుండా మీ జీవిత భాగస్వామి కూడా సెక్స్‌లో సంతృప్తి పొందుతున్నారా, లేదా అని చూసుకోవాల్సి ఉంటుంది.

తమ కోరిక తీరితే చాలనే వాళ్లు జీవిత భాగస్వామి గురించి పట్టించుకోరు. దానివల్ల సెక్స్ వన్‌సైడ్ అయిపోయి జీవిత భాగస్వామికి అదో బోర్ వ్యవహారంగా మారే ప్రమాదం ఉంది. మీరు సాధారణంగా చేసే పొరపాట్లు ఇలా ఉంటాయి.

అయిపోగానే అటు తిరిగి...

అయిపోగానే అటు తిరిగి...

మహిళతో సెక్స్ పూర్తి చేయగానే చాలా మంది పురుషులు పక్కకు తిరిగి పడుకుని నిద్రపోతారు. అలాంటి పురుషుడు నిజంగానే స్వార్థపరుడు. తన మగాడు చాలా స్వార్థపరుడని ఆమె నొచ్చుకుంటుంది కూడా. సెక్స్ పూర్తి చేసిన తర్వాత ఆమెను కౌగిలించుకుని పడుకుంటే ఆమె ఎంతో ఆనందిస్తుంది.

సిగ్గు వదిలేయాలి...

సిగ్గు వదిలేయాలి...

తనకు ఏ విధంగా సెక్స్ చేస్తే ఆనందాన్నిస్తుందో చెప్పడానికి కొంత మంది సిగ్గుపడుతుంటారు. ఈ రకమైన మనస్తత్వం ఎక్కువగా మహిళల్లో ఉంటుంది. తాను చెప్తే తన మగాడు ఏమనుకుంటాడో అనే ఆందోళన కూడా లోపల ఉంటుంది. అలా చెప్పకుండా సెక్స్ అయిపోగానే ఎలా ఉందని అడిగితే బాగుందని అబద్ధం చెబుతుంటారు. అలా కాకుండా తనకు ఏ విధమైన రీతిలో సెక్స్ చేస్తే ఆనందాన్ని ఇస్తుందో చెప్పి పూర్తి స్థాయిలో భావప్రాప్తి పొందితే ఇరువురికి కూడా సంతృప్తిగా ఉంటుంది.

ఆవలింతలు తీసి....

ఆవలింతలు తీసి....

కోరికతో దగ్గరికి వస్తుంటే ఆవలింతలు తీస్తూ నిద్రవస్తుందని పక్కకు తిరిగి పడుకుంటే మీ జీవిత భాగస్వామి తీవ్రమైన చిరాకు వస్తుంది. ఇంటి పనిలోనూ, ఆఫీసు పనిలోనూ, పిల్లల పనిలోనూ అలసిపోయిన మహిళలు సాధారణంగా ఆ రకంగా వ్యవహరిస్తుంటారు. ఆవలింతలను ఆపేసి, కాసేపు అతనితో సరదాగా మాట్లాడుతూ రతిక్రీడకు సిద్ధపడితే దాంపత్య జీవితం హాయిగా ఉంటుంది. పురుషులు కూడా తమ తీరిక లేని పనులతో అలసిపోయి తమ మహిళలను నిర్లక్ష్యం చేస్తుంటారు. పడక ఎక్కగానే గుర్రు పెట్టి నిద్రపోతుంటారు. అటువంటి పురుషులతో మహిళ తీవ్రంగా విసిగిపోయే అవకాశం ఉంది. ఆ విసుగు వివిధ రూపాల్లో వ్యక్తమై దాంపత్య జీవితం నరకంగా మారుతుంది.

అబద్ధం చెప్పడం...

అబద్ధం చెప్పడం...

సెక్స్‌లో సంతృప్తి గురించి జీవిత భాగస్వామితో అబద్ధం చెప్పడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. అది జీవిత భాగస్వామిని మోసం చేయడమే. అది ఆనందాన్ని తగ్గించి, లైంగిక జీవితాన్ని దెబ్బ తీస్తుంది. అది తెలిస్తే మీ జీవిత భాగస్వామి తీవ్ర నిరాశకు గురయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల మీ జీవిత భాగస్వామితో మీకు నచ్చిన పద్ధతలో రతిక్రీడను జరిపి ఆనందం పొందడం మంచిది. తనకు ఎలాంటి సెక్స్ కావాలో, తనతో సెక్స్ సమయంలో ఎలా వ్యవహరిస్తే, ఏమేం చేస్తే బాగుంటుందో చెప్పి ఆనందాన్ని జుర్రుకోవడం ఇరువురికి కూడా మంచిది.

గట్టిగా కొరకడం...

గట్టిగా కొరకడం...

రతిక్రీడ జరిపే సమయంలో తన సత్తా చాటాలనే ఉద్దేశంతో కొంత మంది పురుషులు స్తనాలను గట్టిగా ఒత్తుతారు. కొన్ని చోట్ల పంటితో కొరుకుతారు. అది చిరాకు తెప్పించి, సెక్స్‌కు విముఖరాలిని చేస్తుంది. అటువంటి సందర్భాల్లో మహిళలు సెక్స్ అంటే భయపడవచ్చు. స్త్రీలు కూడా తన పురుషుడిని దంతాలతో కొరికితే తీవ్రమైన నొప్పి వల్ల కామోద్రేకం కాస్తా చిరాకులోకి మారిపోవచ్చు. ఈ విషయంలో ఇరువురు కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సే ఉంటుంది.

 

English summary
Man and woman may do few mistakes during sex. But in the process they should avoid such things.
Story first published: Friday, May 19, 2017, 15:59 [IST]

Get Notifications from Telugu Indiansutras